పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్యం
1 min read

నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్
ఓర్వకల్లు, న్యూస్ నేడు: పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని, ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, “స్వచ్ఛతే సేవ – శుభ్రమైన సమాజమే శ్రేయస్కరం” అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం స్వచ్ఛతే సేవ ఉద్యమం కార్యక్రమంలో భాగంగా నన్నూరు టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు హెడ్ మదన్ మోహన్ వారి సిబ్బంది పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు హెడ్ మదన్ మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవ ఉద్యమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతోందన్నారు.. ఈ కార్యక్రమం ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మరియు స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.నన్నూరు టోల్ ప్లాజా వద్ద పరిసర ప్రాంతాల శుభ్రం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం మొక్కలు నాటి ప్రజలతో స్వచ్ఛత పట్ల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు హెడ్ మదన్ మోహన్ టోల్ ప్లాజా సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

