వరల్డ్ హార్ట్ డే వేడుకలను జయప్రదం చేయాలి- హెల్త్ వర్సిటీ వీసీ డా.చంద్రశేఖర్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈనెల 28 వ ఆదివారం జరుగనున్న వరల్డ్ హార్ట్ డే వేడుకలను జయప్రదం చేయాలని డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్- ఛాన్సలర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డా.చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేనివిధంగా 2002 సం.లో కర్నూలు నగరంలో వైద్యనిపుణులు, మేధావులతో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ స్థాపించామని ఆయన తెలిపారు. 2005 సం. నుంచి ప్రతి ఏటా కర్నూలులో వరల్డ్ హార్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. 2011 లో కర్నూలు హెల్త్ క్లబ్ స్టాపించిన అనంతరం ప్రతి నెలా వైద్య అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఎన్నో పర్యాయాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. ఈ ఏడాది వరల్డ్ హార్డ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోనే పేరొందిన ప్రఖ్యాత వైద్య నిపుణులను “అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డుతో సన్మానిస్తున్నామని డా. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు చెందిన ప్రఖ్యాత కార్డియాలజస్ట్ డా. ప్రతాప్ చంద్ర రత్ కు ఈ అవార్డు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు స్థానిక ఏ.క్యాంప్ లోని కర్నూలు హెల్త్ క్లబ్ లో నిర్వహించనున్న వరల్డ్ హార్ట్ డే వేడుకలకు గౌరవ అతిధులుగా జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు యంపీ బస్తి పాటి నాగరాజు తదితరులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు పాల్గొని జయప్రదం చేయాలని డా. చంద్రశేఖర్ కోరారు.

