జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ఈ నెల 16 వ తేదీన ప్రధానమంత్రి జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రధానమంత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు..అయితే ప్రాథమికంగా సమాచారం అందిందని, పర్యటన కు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారుకాన్వాయ్, ఫుడ్ అరేంజ్మెంట్స్, వీఐపీ లకు వసతి, కంట్రోల్ రూమ్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్,ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

