బండలాగూడు పోటీల ప్రారంభోత్సవం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో బండలాగూడు పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గ్రామస్తులతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలు మన సంప్రదాయ సంస్కృతికి ప్రతిబింబం అని, ఇలాంటి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాక ఐక్యతను పెంచుతాయని అన్నారు.అలాగే, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం క్రీడలతో పాటు విద్య, ఉపాధి రంగాల్లో కూడా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు, క్రీడాకారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


