NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరూ శుక్రవారం డ్రై డే గా పాటించాలి

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు:  ఉదయం తెలుగు గేరిలో జరుగుచున్న ఫ్రెడే-డ్రై డే కార్యక్రమములో జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులశెట్టి పాల్గొని అనంతరం   మాట్లాడుతూ దోమలు వర్షాకాలంలో వృద్ధి చెందుతాయని ,దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు.డేంగి,మలేరియా,చికూన్ గున్యా,మెదడువాపు,ఫైలేరియా లాంటి వ్యాధులు దోమ కాటు ద్వారా వస్తాయని తెలిపారు. దోమలు పెరగకుండా ప్రతి ఒక్కరూ  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ శుక్రవారం డ్రై డే గా పాటించాలన్నారు..ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి,ఇంట్లోకి దోమలు రాకుండా సాయంత్రం వేళ తలుపులు మూసి ఉంచాలి, దోమ కాటు నుంచి రక్షణ కోసం తెరలు వాడాలని సూచించినారు. ఈ కార్యక్రమంలొ,మహిళా ఆరోగ్య కార్యకర్త,ఆశా కార్యకర్త తిరుపతమ్మ మరియు ప్రాజెక్షనీస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author