బెస్త సంక్షేమ సంఘం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా మల్లె వెంకటసుబ్బయ్య
1 min read
చెన్నూరు ,న్యూస్ నేడు : బెస్త సంక్షేమ సంఘం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా మల్లె వెంకటసుబ్బయ్య నియమితులయ్యారు. చెన్నూరు బెస్త కాలనీకి చెందిన మల్లె వెంకటసుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నే కాకుండా ఎంతో కాలంగా ఆయన బెస్త సంక్షేమ సంఘంలో సభ్యులుగా ఉంటూ ఆ వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ప్రధానంగా ఆర్ఎస్ఎస్ లో పలు శాఖలలో పనిచేశారు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీ కి విధేయుడిగా పనిచేయడంతో ఆయనను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి,, గుర్తించి ఆయనకు బెస్త సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించడం జరిగింది. ఈ పదవికి ఎంపిక చేసిన సందర్భంగా మల్లె వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త అయినటువంటి నన్ను గుర్తించడమే కాకుండా నాకు సముచితమైనటువంటి బెస్త సంక్షేమ సంఘం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి, మా పెద్దాయన పుత్తా నర్సింహారెడ్డి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి,కి ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నా నియామకానికి సహకరించిన చెన్నూరు మండల నాయకులు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, ఇంది రెడ్డి శివారెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తల కృషితో నాకు ఈ గౌరవం దక్కిందని తెలుగుదేశం కార్యకర్తలకు, నా కుల సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లాలోని బెస్త వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయన టిడిపి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తానరసింహారెడ్డి,ని ఆయన తనయులు కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి లను కలిసి వారికి పుష్పకృత్యం అందజేసి శాలువా కప్పి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కల్లూరు విజయ భాస్కర్ రెడ్డి, ఎం వెంకటసుబ్బయ్య, ఆకుల చలపతి, సుబ్రహ్మణ్యం, ఓబుల రెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

