స్మాల్ స్మార్ట్ కార్డు పంపిణీ..
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని నల్ల మేకల పల్లి గ్రామంలో డోన్ శాసనసభ సభ్యులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశామని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు తమ్మినేని రాజశేఖర్, నంద్యాల జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బట్టా సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాలు ప్రజలకు ఎంత తోడ్పడుతున్నాయని, సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని , ఈ స్మార్ట్ కార్డులు మా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ కార్డులు అందజేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్ల మేకలపల్లి గ్రామ తెదేపా నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

