NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపటి ఫ్యాప్టో ధర్నా ను విజయవంతం చేయండి

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడిచినా పెండింగ్ డిఎ లు కానీ,పిఆర్సీ కమిటీ కానీ నియమించక పోవడం దారుణమని,30% ఐఆర్  తక్షణమే ప్రకటించాలని,రోజు రోజు కి యాప్ ల భారం తో ఉపాధ్యాయులు బోధన చేయలేని పరిస్థితి వచ్చిందని ,యాప్ ల భార తగ్గిస్తామని హామీ ఇచ్చారని కానీ రోజుకో కొత్త ప్రోగ్రాం తీసుకుని వస్తూ యాప్ లో ఫోటోలు అప్లోడ్ చేయమని వత్తిడి చేస్తున్నారని దీనివల్ల బోధన కుంటుపడుతుందని కావున యాప్ ల భారం తగ్గించాలని,దాదాపు 30 వేల కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని  వీటన్నిటి పరిష్కారం కొరకు  ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రేపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే ధర్నా కు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్,మాజీ యూటీఎఫ్ ప్యాపలి మండల అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి పిలుపునిచ్చారు.పాఠశాల అనంతరం హుస్సేనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అన్వర్ బాషా,గోపాల్,చార్లెస్, కంబగిరి రాముడు,దివాకర్,జయలక్ష్మి, రుక్సాన ఖాతున్, లక్ష్మీదేవి, రాగవేణి,సుజాత తదితరులు పాల్గొన్నారు.

About Author