NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

1 min read

రైతు సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎంపీపీ చీర్ల

చెన్నూరు ,న్యూస్ నేడు: రైతులు పండించిన వరి ధాన్యానికి  గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని రైతులతో కలిసి రైతు సమస్యలపై ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. చెన్నూరు మండల రైతులు మేజర్ పంట అయినటువంటి వరి సాగుకు ఎక్కువ మొగ్గు చూపుతారని అటు బోరుబావుల కింద,  ఇటు కేసి కెనాల్ కింద ఎక్కువగా వరి సాగు చేయడం జరిగిందని అయితే రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా దళారుల చేతిలో  రైతులు ఎక్కువగా నష్టపోతున్నట్లు ఆయన ఈ సమస్యలపై కలెక్టర్ కు విన్నవించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర క్వింటాకు 2369 రూపాయలు ఉండగా దళారులు 80 కేజీలు బస్తా ధన్యాన్ని కేవలం 1150 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని దీంతో రైతులు గిట్టుబాటు దరలేక కుదేలవుతున్నారని ఆయన రైతు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో ప్రభుత్వహయాంలోలో ఖరీఫ్ , రబీ సీజన్ల లోని రెండు పంటలకు మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవడం జరిగిందని ఇప్పుడు కూడా అలాగే ఈ సంవత్సరంలో కూడా రైతులు ఆదుకోవాల్సిందిగా  ఆయన కలెక్టర్ కు విన్నవించుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతులు రామకృష్ణారెడ్డి, గంగాధర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author