NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ

1 min read

పెండింగ్ బకాయిలు, 12వ పి.ఆర్.సి ప్రకటించాలని డిమాండ్

ఫ్యాప్టో “పోరుబాట “కార్యక్రమంలో  ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ

కర్నూలు, న్యూస్​ నేడు:  ఫ్యాప్టో ఆధ్వర్యంలో  జరిగిన “పోరుబాట” కార్యక్రమంలో బోధనేతర కార్యక్రమాలను, విద్యాశక్తి కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ధర్నా శిబిరం నుండే  ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ.ఈ ధర్నా కార్యక్రమానికి ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ అధ్యక్షత వహించడం జరిగినది. విద్యారంగంలో బోధ నేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోవడం వలన చాలా ఇబ్బందిగా ఉన్నదని, అదేవిధంగా పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలని, 30% మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హై స్కూల్ ప్లస్ లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టి హైస్కూల్ ప్లస్ లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలకు, రెసిడెన్షియల్ స్కూల్స్ కు సొసైటీలకు 62 సంవత్సరములకు పదవి వివరణ వయసు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి తో పాటు ఫ్యాప్టో కో చైర్మన్స్ కె.నరహరి,బి.మనోజ్ కుమార్, సిహెచ్ వెంకటేశ్వర్లు, కాకి ప్రకాష్ రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్ వెంకటేశ్వర్లు,కె. భానుమూర్తి,జి శ్రీనివాసరావు కోశాధికారి, చింతల సుబ్బారావు, కార్యదర్శి ఎం ప్రవీణ్ కిరణ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. రఘునాథరెడ్డి, సిహెచ్ మంజుల, జి హృదయ రాజు, సిహెచ్ రమేష్, ఎం బాబు రాజేంద్రప్రసాద్, సిహెచ్ రవి , పి నరోత్తమ రెడ్డి,బి కరిమల్లారావు చౌదరి పాల్గొన్నారు. ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండల సభ్యులు బి.గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్,ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి రమణ, ఏపీ సీపీఎస్సీఏ బాధ్యులు సీఎం దాస్, సతీష్, బాజీ పఠాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author