NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూల్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆదివారం నాడు సగవరంగా నిర్వహించబడినది.   దేశసేవే ధ్యేయంగా కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూనే మరియు ఏమాత్రం తీసిపోకుండా తమకు జన్మనిచ్చిన కర్నూలు గడ్డకి కూడా నిస్వార్థ సేవ చేయడానికి మేమున్నాం అన్నది ఈ భారతమాత ముద్దుబిడ్డల యొక్క లక్ష్యం.  మహోన్నతమైన కార్యక్రమమును జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు ముఖ్య అధ్యక్షులు సగరవంగా ప్రారంభించారు.  60 మంది పాల్గొని దాదాపు 50 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ సమస్త వారు ప్రతి మూడు నెలలకి ఒకసారి  బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు.  ఇందుమూలంగా ఏ ఒక్క సైనికుడికి గాని మరియు వారి కుటుంబ సభ్యులకు గానీ బ్లడ్ కొరత వలన ఇబ్బంది పడకూడదు అన్నది మా ఉద్దేశం అని వారు తెలియజేశారు. ఇక ముందు కూడా వారు ఎన్నో మహోన్నతమైన సామాజిక కార్యకలాపాలు తలపెడతామని వారి అసోసియేషన్ బృందం తెలియజేశారు.

About Author