రామాయణం వాల్మీకి మహర్షి సమకాలీన జీవిత చరిత్ర
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
టి. సోమల గూడూరులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీమద్రామాయణం వాల్మీకి మహర్షి సమకాలీన జీవిత చరిత్రని, స్వయంగా సీతారాముల ఆదర్శ ప్రేమమయమైన జీవితాన్ని దర్శించిన ఒక మహా ఋషిపుంగవుడం వాల్మీకి అని, ఇంతటి గొప్ప కవి ప్రపంచంలో ఎక్కడా కానరాడని, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ ఆధ్వర్యంలో నందవరం మండలం, సోమలగూడూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నృశింహస్వామి దేవస్థానంనందు ఐదురోజుల ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమద్రామాయణంలోని ఒదర్శాన్ని వివరించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, ధార్మిక ప్రవచకులు సి.తులశమ్మ చేసిన ధార్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో అలరించినది. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు కె.రుక్మాంగధరెడ్డి, కే ఆనంద రెడ్డి, గ్రామ సర్పంచ్ యం.గోవిందు, ఆలయ ధర్మకర్త తెలుగు వీరేష్, టి.లక్ష్మన్న, శ్రీనివాసులు, టి గోపాల్, టి రామచంద్ర, టి నాగేష్, బుడ్డ గోకారి, రామలింగప్ప, తిక్కయ్య పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

