NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీకేజీని తక్షణమే సరిదిద్దాలి: ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి మండలంలోని వెంగళంపల్లి చెరువుకు పోలాల వైపు వెళ్తున్న పైప్‌లైన్ లీక్ కావడం వల్ల టమోటా, కంది వంటి పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల సమస్యను తెలుసుకున్న  డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  వెంటనే స్పందించి, నీరు లీక్ అవుతున్న పొలాల దగ్గరకు స్వయంగా వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే  ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి, లీకేజీని తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే నిర్ణయాన్ని రైతులు అభినందించారు. తేదేపా నాయకులు చండ్రుపల్లి లక్ష్మీనారాయణ యాదవ్, రాజా నారాయణ మూర్తి, మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు, మైనారిటీ నాయకులు ఖాజా పీర్,మాజీ సర్పంచ్ జయశీలమ్మ,శంకర్, రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ రామేష్ ,వెంకటప్ప,కోదండరామయ్య రమణ తదితరులు గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

About Author