NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా

1 min read

జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నూరుల్ కమర్

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పేర్కొన్నారు.ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ గా పనిచేసి కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైన సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఉదయం 10.40 గంటలకి జాయింట్ కలెక్టర్ గా నూరుల్ కమర్   పదవీ బాధ్యతలు చేపట్టారు..అనంతరం  మత పెద్దలు సర్వమత  ప్రార్థనలు నిర్వహించి  జాయింట్ కలెక్టర్ ను  ఆశీర్వదించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.  ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.తదనంతరం జాయింట్ కలెక్టర్ కు  జిల్లా అధికారులు, తదితరులు పుష్పగుచ్చాలతో  అభినందనలు తెలిపారు.

About Author