దైవనామ స్మరణ బ్రతుకులకు ధన్యతను చేకూరుస్తుంది..
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తితిదే
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: దైవ నామస్మరణ బ్రతుకులకు ధన్యత చేకూర్చుతుందని, సన్మార్గ వర్తనులు కావాలంటే ప్రతి వ్యక్తికి దైవభక్తి ఉండాలని అటువంటి దైవభక్తి అలవడాలంటే గుడి, బడి, ఆచార్యుడు ఈ మూడు మూల బిందువులని, ఇవి పవిత్రంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుండి నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భగవన్నామ విశిష్టతపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు కె.రుక్మాంగధరెడ్డి, కే ఆనంద రెడ్డి, గ్రామ సర్పంచ్ యం.గోవిందు, ఆలయ ధర్మకర్త తెలుగు వీరేష్, టి.లక్ష్మన్న, శ్రీనివాసులు, టి గోపాల్, టి రామచంద్ర, టి నాగేష్, బుడ్డ గోకారి, రామలింగప్ప, గురురాజ, తిక్కయ్య పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

