108 వాహనంలో ప్రసవం… మగ బిడ్డకు జననం..
1 min read
108 సిబ్బంది ని అభినందించిన జిల్లా అధికారులు..
నంద్యాల/బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి లో అవుకు మండలం శివవరం గ్రామానికి కి చెందిన బాల ఉసెనమ్మ అనే మహిళ ప్రసవం కోసం చేరింది. బాల ఉసేనమ్మ కు గతంలో గుండెకు ఆపరేషన్ జరగటం వల్ల రిస్క్ కేసుగా పరిగణించి నంద్యాల హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగింది. నంద్యాల ఆసుపత్రికి బాల హుస్సేనమ్మ ను తీసుకొని వెళ్తుండగా ప్రసవము నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఈఎంటీ భాస్కర్ 108 వాహనంలోనే ప్రసవం చేయడం జరిగింది. బాల ఉసేనమ్మ కు మగ బిడ్డ జన్మించడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ భాస్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని 108 నంద్యాల జిల్లా మేనేజర్ వెంకట తిమ్మారెడ్డి ఈఎంటి భాస్కర్ ను, పైలెట్ ఆర్కే రాముడు ని అభినందించడం జరిగింది.

