కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పని చేయాలి
1 min read
ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్
కర్నూలు, న్యూస్ నేడు: కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పని చేయాలని ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్ తెలిపారు.సోమవారం ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో కంట్రోల్ రూమ్ పని తీరు పై ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్ కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ లో పని చేసే వారు 24 గంటలు షిఫ్ట్ ల వారిగా డ్యూటీ లు వేసుకొని ప్రతి 3 గంటలకు ఒకసారి అని టీం ల నుండి సమాచారం తెప్పించుకోవాలన్నారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, ఐఏఎస్ అధికారి విజయ సునీత, దినేష్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్,ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, సచిన్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, సిబ్బంది,

