ఏఈ లక్ష్మన్న పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి
1 min read

గార్లదిన్నె గ్రామస్తులు తల్లిదండ్రులు డిమాండ్
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు మండలం లో గతంలో పెసలదిన్నె పంచాయతీ పరిధిలో ఉన్న గార్లదిన్నె లో నాడు నేడు పనులు అవకతవకలు చేసినటువంటి ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మన్న ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి పర్మినెంట్ హెచ్ఎం లేకపోయేసరికి ఏఈ లక్ష్మన్న అణువుగా చేసుకుని పనుల్లో చేపిస్తున్నానంటూ అరకొర పనులు చేయించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు అదేవిధంగా పాఠశాలలో దాతలు ఇచ్చినటువంటి ఫ్యాన్లు మిగతా మిగతా సామాగ్రిని మాయం చేశారని బాత్రూములకు వంటగదికి ఎలాంటి డోర్లు ఫిట్ చేయకుండా ఎలాంటి టైల్స్ అతికించకుండా తాను ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టానుసారంగా బిల్లులు చేసుకొని స్వాహా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇవే కాకుండా గతంలో గ్రామస్తులైన మేము అసిస్టెంట్ ఇంజనీరింగ్ లక్ష్మన్నను నిలదీయగా డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి పాఠశాల పనులు పూర్తి చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఉన్నిందంతా దోచుకొని కులమాల గ్రామానికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది దీనిపైన మేము ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయన వ్యవహరించడం జరుగుతుందని ఇవే కాకుండా కొత్తగా వచ్చినటువంటి ఏఈ ను అడగగా ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేయడం జరిగింది ఇకనైనా పై అధికారులు దీనిపైన స్పందించి గార్లదిన్నె నాడు నేడు పనుల పైన విచారణ జరిపి ప్రస్తుతం కులమాలలో పనిచేస్తున్న ఏఈ లక్ష్మన్న సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మా పాఠశాల కోసం ఉద్యమానికైనా వెనుకాడబోమని గ్రామస్తులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఏలీషు పౌలు తిమ్మ గురుడు చిన్న రాముడు సురేష్ ఆనంద్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

