NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి..

1 min read

నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య

సమస్యల్లేని పురపాలక సమావేశం..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నందికొట్కూరు పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం జై కిసాన్ పార్కులో మంగళవారం మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన పురపాలక సంఘ సమావేశం జరిగింది.పట్టణంలో ఏమి సమస్యలు లేవు అనే విధంగా సమస్యల గురించి మాట్లాడకుండానే మధ్యలోనే వెళ్ళిపోవడం గమనార్హం. ముందుగా అధికారులు సమావేశ తీర్మానాలను వివరించారు.2వ వార్డులో జంతు వధశాలను తొలగించాలని ప్రతి సమావేశంలో చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని మున్సిపాలిటీ అధికారులపై కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మండిపడ్డారు.దీనిపై ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కౌన్సిలర్లు అంటే లెక్క లేదా అని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో మార్కెట్ యార్డ్ నుండి కేజీ రోడ్డు జమ్మిచెట్టు వరకు డివైడర్లతో మరియు సెంట్రల్ లైట్లను వేయించేందుకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు.పట్టణ అభివృద్ధి కొరకు 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 3 కోట్లు వచ్చే అవకాశం ఉందని పట్టణంలో ముఖ్యంగా డ్రైనేజీ తదితర సమస్యలు అధికంగా ఉన్నాయని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తూ రాజకీయాలకు తేడా లేకుండా అభివృద్ధి చేస్తామని వచ్చే నెలలో మూడు కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని అన్నారు. వార్డుల్లో పనులు జరిగేటప్పుడు పనులను ఆపితే దానికి డీఈ,ఏఈ లు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు.కౌన్సిలర్ చాంద్ బాష మాట్లాడుతుండగా మధ్యలోనే సభ్యులు బయటకు వెళ్లిపోయారు.ఆ తర్వాత అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసి భోజనం చేస్తున్న వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ఎస్.బేబీ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,కౌన్సిలర్లు మరియు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.

About Author