ఘనంగా అబ్దుల్ కాలం జయంతి వేడుకలు…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అబ్దుల్ కలాం కలలను సాకారం చేయడం యువత లక్ష్యంగా పెట్టుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ తెలిపారు.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఘనంగా నివాళులర్పించారు మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన సేవలను స్మరించారు.ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు చే ప్రారంభించబడ్డ కళాశాలలో అబ్దుల్ కలాం జయంతి చేయడం గొప్ప పరిణామం అని వారు కొనియాడారు అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగానే కాకుండా దూరదృష్టి గల నాయకుడు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవంగా చూడేలా చేసిన వ్యక్తి. ఆయన జీవితమంతా క్రమశిక్షణ, జ్ఞానం, కృషికి ప్రతీక. నేటి యువత కలాం జీవితం నుండి స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధి దిశగా కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.భారత మాజీ రాష్ట్రపతి, దేశరక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించిన మిసైల్ మ్యాన్, క్షిపణిశాస్త్ర విజ్ఞాన రంగంలో చిరస్మరణీయ సేవలు అందించిన భారతరత్న స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ . భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న తపనతో “కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అంటూ ఆయన ఇచ్చిన సందేశాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. వారు తెలిపారుఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మైనారిటీ యువ మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాష,సునీల్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ నేతలు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు,పాల్గొన్నారు.

