NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీడియా గ్యాలరీలో  పాత్రికేయులు మినహా ఎవరిని అనుమతించకూడదు

1 min read

ప్రధానమంత్రి సూపర్ జీఎస్టీ బహిరంగ సభ కార్యక్రమ మీడియా ఏర్పాట్లను పరిశీలించిన సమాచార శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 16వ తేదీన ఒకరోజు కర్నూలు పర్యటనలో  సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం సమాచార శాఖ డైరెక్టర్ కే ఎస్ విశ్వనాథన్ మీడియా ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆయన మీడియా వారికి ఏర్పాటు చేసిన భోజన వసతి  ప్రాంతాన్ని పరిశీలించారు. సమయానికి  మీడియా వారికి లంచ్ అందజేయాలని అధికారులకు సూచించారు. అనంతరం  మీడియా వారికి త్రాగునీరు స్నాక్స్ వంటి మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మీడియా గ్యాలరీలో మీడియా పాత్రికేయులు మినహా ఎవరిని అనుమతించకూడదని తెలిపారు.మీడియా సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాట్లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పాత్రికేయులు మీడియా గ్యాలరీకి చేరుకోవడానికి సూచిక బోర్డులను  ఏర్పాటు చేయాలని సూచించారు.అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, విఐపి గ్యాలరీలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జోన్- 4 ఆర్ జె డి మహబూబ్ బాషా, సమాచార శాఖ డిడి జయమ్మ, జూన్ 1,2 ఆర్.ఐ ఈ  సివి కృష్ణారెడ్డి, జూన్ 3, 4 శ్రీధర్ రెడ్డి, అనంతపురం డిఐపిఆర్ఓ బాలకొండయ్య, తిరుపతి డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, ఏ ఈ ఐ ఇ లు, డివిజనల్ పిఆర్వోలు, సమాచార శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author