మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల తిరుగుబాటు
1 min read
ప్రజా వైద్యాన్ని కాపాడే యుద్ధంలో వైఎస్సార్సీపీ ముందంజ
కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపు
కర్నూలు, న్యూస్ నేడు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలనే కూటమి కుట్రలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమంను ఘనవిజయం చేసేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కర్నూల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహరి పిలుపునిచ్చారు. ఒకటో వార్డు కండేరి నందు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన సంతకాల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ “ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనివ్వకూడదు. రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం, ప్రైవేట్ కాపిటలిస్టుల చేతుల్లోకినెట్టడం చంద్రబాబు లక్ష్యమని” వ్యాఖ్యానించారు.చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండకట్టాలన్నారు. అధికారం కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి కర్నూల్ నగర మేయర్ బి వై రామయ్య ఒకటో వార్డు కార్పొరేటర్ పి షాషావలి,మరియు నగర వార్డు కార్పొరేటర్లు పార్టీ జిల్లా మరియు రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

