విధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి… రాష్ట్ర డిజిపి
1 min read
ప్రణాళిక ప్రకారం అందరూ సమన్వయంతో పని చేయాలి.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి.
ఎవరికి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలి.
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల పై డిజిపి గారి సమీక్ష.
కర్నూలు, న్యూస్ నేడు: అక్టోబర్ 16న కర్నూలులో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపియస్ తెలిపారు. ఈ సంధర్బంగా బుధవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ డిజి ఎన్.మధుసుధన్ రెడ్డి, ఐజి శ్రీకాంత్, డిఐజి లు కోయ ప్రవీణ్, గోపినాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, సత్యయేసు బాబు, ఫక్కీరప్ప కాగినెల్లి, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ల తో కలిసి రాష్ట్ర డిఐజి సమీక్షా సమావేశం నిర్వహించారు.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రధాని పర్యటన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, రూట్ మ్యాప్ , రాగమయూరి బహిరంగ సభ, గూగుల్ జియో మ్యాప్ ను తెర పై చూపిస్తూ రాష్ట్ర డిజిపి కి వివరించారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల ఏర్పాట్ల పై పలు సూచనలు చేశారు. బందోబస్తు విధులు నిర్వహించే ఐపియస్ అధికారులకు డిజిపి దిశా, నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో డిఐజీలు కోయ ప్రవీణ్, సత్య యేసు బాబు, గోపీనాథ్ జెట్టి , సెంథిల్ కుమార్, ఫకీరప్ప, సీతారాం, ఎస్పీలు విక్రాంత్ పాటిల్, జగదీష్, కృష్ణ కాంత్, షెల్కే నచికేత్ విశ్వనాథ్, దీపికా పాటిల్, కృష్ణ కాంత్ పటేల్, సీతారాం,పరమేశ్వర్ రెడ్డి, చక్రవర్తి,శ్రీనివాసరావు, గంగాధర్ రావు, ధీరజ్ కునుబిల్లి , దేవరాజ్, సుమిత్ సునీల్ , కమాండెంట్ ఆనంద్ రెడ్డి, ట్రైనీ ఐపిఎస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ లు, డిఎస్పీలు ఉన్నారు.


