సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న అధికారులు
1 min read

సరైన సమాచారం ఇవ్వని రెవిన్యూ అధికారుల పై అప్పిల్
మంత్రాలయం న్యూస్ నేడు : అడిగిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని రెవెన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారని వారి పై ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ కు అప్పిల్ చేస్తున్నట్లు మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన ఫౌరం ఫర్ ఆర్టీఐ జిల్లా లీగల్ సెల్ సలహాదారులు విజయకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ రీసర్వే పై ,ఆర్టీఐ ద్వారా మంత్రాలయం తహశీల్దార్ పౌర సమాచారం అధికారికి సమాచారం కోరడం జరిగిందని అయితే దీనిపై పూర్తి సమాచారం వివరాలు అధికారులు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. గత నెలలో రీ సర్వే పై ఇతర సమస్యల పై ఆర్టీఐ ద్వారా మంత్రాలయం తహశీల్దార్ కార్యాలయ అధికారులకు సమాచారం హక్కు చట్టం ద్వారా సమాచారం కోరడం జరిగిందన్నారు. మూడు ,రోజుల క్రితం గ్రామ వీఆర్వో ద్వారా సమాచారం ఆందించారని అందులో ఆయన అడిగిన సమాచారానికి అసంపూర్తి సమాచారము ఇచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2005 లోపౌరులకు సమాచారం అడిగే హక్కు కల్పించిందని, అదే చట్టముగ రూపకల్పన చేశారని అయితే కొంత మంది అధికారులు నిర్లక్ష్యం ,అవగాహన లోపంతో సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. సరైన సమాచారం, ఇవ్వనందుకు ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ కు మొదటి అప్పిల్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

