నేటినుండి శివనామస్మరణతో మార్మోగనున్న శైవ క్షేత్రాలు …
1 min read

మండల వ్యాప్తంగాశివాలయాల్లో కార్తీక మాస ఉత్సవాలు..
చెన్నూరు, న్యూస్ నేడు: చెన్నూరు మండలంలో శివాలయాల్లో కార్తీక మాస ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. చెన్నూరు ట్రంక్ రోడ్డు ప్రక్కన వెలసిన పురాతన శ్రీశ్రీశ్రీ లలితాంబిక సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 22న సాయంత్రం ఆరు గంటలకు ఆకాశదీపం ఆరోహణ వేద పండితులు కొడురు కమాలకర్ స్వామిచే నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ ప్రత్యేక అభిషేక పూజలు ప్రతిరోజు వివిధ పూజా కార్యక్రమాలు వేద పండితులు కమలాకర్ స్వామి చేతులు మీదుగా పూజలు నిర్వహిస్తారు. చెన్నూరు పెన్నా నది ఒడ్డున వెలసిన మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తిక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆకాశదీపం ఆవిష్కరణ నిర్వహిస్తారు. నెలరోజుల పాటు ఆలయ అర్చకులు ఎం ఆంజనేయ శర్మ పూజలు నిర్వహించనున్నారు. చెన్నూరు మండలం శివాలపల్లి గ్రామ పరిధిలో పుష్పగిరి క్షేత్రానికి వెళ్లే రహదారి ప్రక్కన కాశీశ్వర ఆలయంలో నెల రోజులు పాటు కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో వెలసిన ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బలిసింగాయపల్లి గ్రామ సమీపంలో కైలాసగిరిలో వెలసిన సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయంలో నెలరోజుల పాటు కార్తిక మాస ఉత్సవాలు ఇస్తున్నారు. ఉప్పరపల్లి గ్రామ సమీపంలో కడప కర్నూల్ హైవే రోడ్డు ప్రక్కన వెలసిన మల్లికార్జున స్వామి ఆలయంలో నెలరోజుల పాటు కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రామనపల్లి గ్రామంలో వెలసిన శ్రీ గౌరీ మల్లేశ్వర స్వామి ప్రధాన శివాలయంలో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. చెన్నూరు మండలం దౌళతాపురం అటవీ ప్రాంతంలో వెలసిన దేవరకోన మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఆలయకమిటినిర్వకులుఏర్పటుచెశారు.

