NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూసేకరణ అంశాలపై అధికారులతో కలెక్టర్​ సమీక్ష

1 min read

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఏపిఐఐసి జెడ్ఎమ్ ను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్  ఛాంబర్ లో ఏపిఐఐసి ప్రాజెక్టులు,  భూసేకరణ అంశాలపై కలెక్టర్ ఏపిఐఐసి, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు నీటి సరఫరా పైప్ లైన్ కు సంబంధించి  పెండింగ్ లో ఉన్న  3 కిలోమీటర్ల  ఉన్న భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు…  ఎమ్ఎస్ఎంఈ పార్క్ ల ఏర్పాటుకు సంబంధించి  అడ్వాన్స్ పొజిషన్ కొరకు గాను ఫైల్ సర్కులేషన్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు…  డ్రోన్ సిటీ కి  సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి పెగ్ మార్కింగ్  చేయాలని కలెక్టర్ ఏపిఐఐసి జెడ్ఎమ్ ను ఆదేశించారు…ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపిఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author