NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణ సంఘం  కార్తీక వనభోజనాల కరపత్రాలు విడుదల

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక వనభోజనాలకు సంబంధించిన కరపత్రములను అధ్యక్షులు   సండేల్  చంద్రశేఖర్ , ఉపాధ్యక్షులు శ్రీ కoచు గంటల శ్యామ్ సుందర్ రావు,   సలహా దారు టీవీ రవిచంద్ర శర్మ , సభ్యులు సివి మురళి కృష్ణ , శ్రీనివాసరాజు, శివన్న,ప్రసన్న, మహేష్, స్వామి  ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ,    ఈనెల 22/ 10/ 25 బుధవారం నుండి 20 /11/ 25 గురువారం వరకు కార్తీకమాసం ఉంటుంది కావున యధావిధిగా మన కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయము నందు 9/ 11 /25 తారీకు ఆదివారం నాడు మన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా కార్తీక్ ను భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోజు ఉదయం గణపతి పూజతో మొదలై గోమాత పూజ ఉసిరికాయ చెట్టు పూజ శివునికి అభిషేకము శ్రీవారికి అభిషేకము ఈ కార్యక్రమాన్ని కూడా ముగించుకున్న తర్వాత మన సమావేశం ఉంటుంది సమావేశంలో బ్రాహ్మణ పెద్దలకు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది అనంతరం భోజన కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రాహ్మణ బంధువులందరూ కూడా పరిచయాలు ఏర్పరచుకొని మీ కుటుంబంలో ఎవరైనా వివాహాలు కావలసినవారు ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఉంటే ఒకరికి మనం చర్చించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలయం కమిటీ వారు పెట్టిన రిజిస్టర్ నందు మీ వివరాలు ఫోన్ నెంబర్లు సంతకాలు చేసి ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముందుకు పోవాలి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్.

About Author