కూర్ని ( నేసే) కులస్థుల క్యాలెండర్ ఆవిష్కరించిన నక్కలమిట్ట..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు న్యూస్: కర్నూలు కూర్ని నేసే సంక్షేమ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంగం జాతీయ ప్రధాన కార్యదర్శి, కుర్ణి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు ప్రారంభించారు. ఆదివారం నగరం లోని స్థానిక బిర్లా కాంపౌండ్ లోని డాక్టర్ బ్రహ్మ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు నగర కుర్ణి నగర సంక్షేమ సంగం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిది నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ కుర్ణి సభ్యులు అందరూ. తమ పిల్లలకు మంచి విద్యాబుద్దులు నేర్పించి వారికి మంచి భవిష్యత్తు ను ఇవ్వాలన్నారు. రానున్న నూతన సంవత్సరం లో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమం లో కూర్ణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాదు గుండుకృష్ణయ్య, ఆదిత్య స్కూల్ వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బందికే వాసు దేవయ్య, జిల్లా అధ్యక్షులు గడిగే ప్రసాద్,మాదిగుండు రామదాసు కే. రామంజి నాయులు, నగర ఉపాధ్యక్షులు బండ మునిశ్వామి, కూర్ని యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కృష్ణ, నగర ప్రదాన కార్యదర్శి రాధ కృష్ణ, పూజారి కృష్ణ,డిష్ రాము, కాంట్రాక్టర్ నారాయణ, నగర నాయకులు, కార్యకర్తలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.