NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్ణాటక  ఉప ముఖ్యమంత్రి తో కలిసి అభివృద్ధికి శ్రీకారం

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు వచ్చిన కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు, మంత్రి బోసరాజు, మాన్వీ మంత్రి హంపయ్య తో కలిసి టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలికి శాలువా పూలమాలతో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. మఠం లో  అభివృద్ధి పనులు చేయడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం ప్రజలకు రైతులకు అందరికీ ఉండాలని పాలకుర్తి తిక్కారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, క్రిష్ణా మోహన్ రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శేట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు ఉన్నారు.

About Author