NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు నగరానికి తాగునీటి సమస్య రాకుండా చూడాలి

1 min read

సుంకేసుల డ్యాం ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. సిరి

కర్నూలు  , న్యూస్ నేడు : కర్నూలు నగరానికి తాగునీటి సమస్య రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్   సుంకేసుల డ్యాం ను పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  డ్యాం నీటి నిల్వ సామర్థ్యం, గేట్ల నిర్వహణ, ఇన్ఫ్లో,  అవుట్ఫ్లోవివరాలను ఇరిగేషన్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.  వేసవికాలంలో కర్నూలు నగరానికి త్రాగునీటి కొరత రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. డ్యాం కు ఏవైనా మరమ్మతులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వానికి పంపించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ వివరాలను తమకు తెలపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ కు మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు..స్టోరేజ్ సామర్థ్యం,.ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టోరేజ్ సామర్థ్యం  0.15 టీఎంసీగా ఉందని, 1998 సంవత్సరంలో నిర్మించబడిందని తెలిపారు. గతంలో ఈ ట్యాంక్ ద్వారా కర్నూలు నగరానికి దాదాపు నాలుగు నెలలపాటు తాగునీరు సరఫరా చేసేవారని, అయితే ప్రస్తుతం నగర జనాభా 6.18 లక్షలకు పెరగడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిల్వతో ఒక నెల వరకు మాత్రమే తాగునీరు సరఫరా చేయగలమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, ఇరిగేషన్ ఎస్ ఈ బాలచంద్రారెడ్డి, హెచ్.ఎన్.ఎన్.ఎస్. ఎస్. ఎస్ ఈ పాండురంగయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, తహశీల్దార్ (అర్బన్) రమేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author