NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బస్సు ప్రమాద ఘటన హృదయ విదారకం

1 min read

రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

కర్నూలు, న్యూస్​ నేడు:  రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన బస్ లకు అన్నిటిలోనూ ఆటోమేటిక్ గా ఫైర్ అలారం సిస్టం ఎనేబుల్ చేస్తున్నామని, తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నామన్నారు.. ప్రమాదానికి గురైన బస్సు 7 సంవత్సరాల బస్ కాబట్టి ఇందులో ఫైర్ అలారం సిస్టం లేదన్నారు.. హైవేల మీద ఈ విధంగా అగ్నికి సంబంధించి ఇది 3 వ ఇన్సిడెంట్ అన్నారు. ఈ అంశం పై  తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో నూతన గైడ్లైన్స్ వేసుకుని వచ్చే విధంగా చర్చించడం జరిగిందని, Ministry of Road Transport and Highways (MoRTH) సెంట్రల్ వారితో కూడా మాట్లాడి ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.. బస్సులో వివిధ రకాల రాష్ట్రలకు సంబంధించిన వారు ప్రయాణం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది మరణించిన 6 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రకటించడం జరిగిందన్నారు.. అదే విధంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మంత్రులతో మాట్లాడ్డం జరిగిందని వారు కూడా మనం ఇచ్చే విధంగానే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారన్నారు… తమిళనాడు, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడా ఇదేవిధంగా ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

About Author