గత ప్రభుత్వ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోతే సమ్మెకు సిద్ధం
1 min read

నవంబర్ 3 నుండి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ సమ్మెకు సిద్ధం: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ కార్మికుల గత ప్రభుత్వ సమ్మె కాలంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ సోమవారం రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఎమ్మిగనూర్ పట్టణంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ *ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.ఎల్లప్ప, మున్సిపల్ కార్మికుల నాయకులు శివకృష్ణ,బీమన్న గౌడ్,చిన్న ఈరన్న ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శ, విజేంద్ర తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని వారు తెలిపారు నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చల్లగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత పథకాలు అందించడంలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి మరణించిన కార్మికులకు ఎక్స్గ్రేసి డబ్బులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, 12వ పిఆర్సి నీ ప్రకటించి మద్యంతర భృతి 30% ప్రభుత్వం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పట్టణ విస్తీర్ణాన్ని బట్టి కార్మికుల నిష్పత్తినీ పెంచాలని పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు సత్వరమే విడుదల చేయాలనీ లేనిపక్షంలో నవంబర్ 3 నుండి మున్సిపల్ కార్మికుల సమ్మెకు సిద్ధమవుతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ యూనియన్ నాయకులు,మహేష్,రాముడు,మల్లి,ఈరన్న,చిన్న రంగన్న తదితరులు పాల్గొన్నారు.

