NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతిమాసము ఒక సందేశమే…

1 min read

గౌరు చరితమ్మ, పాణ్యం శాసనసభ్యులు.

శివరామాలయంలో ప్రారంభమైన ధార్మిక సప్తాహం.

కర్నూలు, న్యూస్​ నేడు:  మానవజన్మను చరితార్థం చేసుకొనుటకు ప్రతి మాసము ఒక సందేశమేనని, ప్రతి మనిషికి నియమనిష్టలు ఎంతో అవసరమని, మానవుడు బుద్ధిజీవిగా జీవించాలంటే సత్సంగత్వం ఎంతో అవసరమని, ప్రతి మానవుడు తనశక్తికొలది దానధర్మాది క్రతువులు నిర్వహించాలని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితమ్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మాధవనగర్ లోని శ్రీశివరామాలయం నందు ధార్మిక సప్తాహాన్ని వారు జ్యోతి ప్రజ్వలనచేసి ప్రవచించారు. మొదటిరోజు ప్రవచనంలో భాగంగా డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని కార్తిక మాస విశిష్టత, దీప, దాన, ఉపవాస మహిమలను గురించి సోదాహరణంగా వివరించి భక్తులను ఆలోచింపచేశారు ఈ కార్యక్రమంలో  ఆలయ కమిటీ అధ్యక్షులు జి.శేషాచలం, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, బాలాజీ సేవాట్రస్ట్ వ్యవస్థాపక అద్యక్షులు వేమారెడ్డి ధనంజయరెడ్డి, వార్డు ఇన్చార్జి రఘునాధ్ రెడ్డి, జనార్ధన రెడ్డి, తితిదే హిందూ ధర్మ ప్రచారమండలి సభ్యులు అంబటి శివశంకర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

About Author