NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవంబర్ 1 న శ్రీ పేట రామాలయంలో 13 అడుగుల రాముడి విగ్రహం ఆవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఈసం ।। చైత్రమాసంలో శతాబ్ది ఉత్సవాలు పూర్తిచేసుకున్న పేట మెయిన్ బజార్ శ్రీ రామాలయం,ముఖద్వారం పైన శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా ” శ్రీ రాజా రామచంద్రుని 13 అడుగులు విగ్రహ నిర్మాణం పూర్తిఅయ్యి ఈనెల అనగా కార్తీక  శుక్ల ఏకాదశి  01/11/2025, శనివారము, ఉ. 08:30 గం.లకు గౌరవ మాజీ రాజ్యసభ్యులు,ప్రముఖ వ్యాపారవేత్త, కర్నూలు నగర అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన భా.జా.పా. నాయకులు టీ.జీ.వెంకటేశ్, మరియు గౌరవ భారీపరిశ్రమల శాఖామాత్యులు టీ.జీ.భరత్ ల చేతులమీదుగా  ఆవిష్కరించబడుతుందనిఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రముఖ బిల్డర్ ,వాసవి గ్లోబల్ పాఠశాల అధినేత సోమిశెట్టి వెంకట్రారామయ్య, అఖిలభారత కరివెన నిత్యాన్నదాన సూత్రం ప్రధాన కార్యదర్శి,సరస్వతి హాస్పిటల్ అధినేత డా. వేణుగోపాల్ , పాతబస్తీలోని శ్రీ లలితా పీఠం వ్యవస్థాపకులు గురుమేడా సుబ్రహ్మణ్యం(సుబ్బిస్వామి) ,మాంటేస్సొరి పాఠశాలల అధినేత రాజశేఖర్,గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డి.వి.రమణ తదితరులు పాల్గొంటారని శ్రీ రామాలయ అభివృద్ధి కమిటి సభ్యులు చిల్కూరు నందకిశోర్,మాజీ కార్పోరేటర్ విఠల్ శెట్టి,ఆలయం ప్రధానార్చకులు మాళిగి హనుమేశాచార్య గార్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు పురప్రజందరూ ఈ బృహత్ కార్యం లో పాల్గొని ఆ ఏకాంతం రాముని కృపకు పాత్రులు కాగలరని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.

About Author