NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

1 min read

రవీంద్రనాథ్ రెడ్డి పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి

 జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి,చిత్తూరు: జిల్లా జాయింట్ కమిషనర్  రవీంద్రనాథ్ రెడ్డి కొంతమంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులపై అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీజీఈఏ జిల్లా సంఘాల నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ఎన్.ఆర్ పేట  స్థానిక జాన్ స్ట్రీట్ టౌన్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు పట్టుకొని  నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల అమానుషంగా, దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడి చేసి, కులం పేరుతో దళిత ఉద్యోగులను దూషించిన రవీంద్రనాథ్ రెడ్డి పై  శాఖపరమైన చర్యలు తీసుకొని  తక్షణమే సస్పెన్షన్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యో గుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ పిలుపు మెరకు మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి.జె.శేషుకుమార్, సెక్రటరీ వి. శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఎస్.ఎస్ ప్రసాద్,హమీద్, ఉస్మాన్,గోపికృష్ణ , రంగారావు నాయుడు మరియు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author