సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: పట్టణంలోని సరస్వతీ శిశు మందిరం మరియు విద్యా భారతి పాఠశాల లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ప్రధానాచార్యులు కె. పార్వతి చిత్రపటానికి మాల వేసి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా వాసు , సీనియర్ ఆచార్యులు మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ గురించి వివరిస్తూ ఈయన 1875 సంవత్సరంలో గుజరాత్ లో జన్మించాడని, ఈయన తన గ్రామంలో ప్రాథమిక విద్య చేసి,ఉన్నత విద్య కోర్స్ కోసం లండన్ వెళ్లి చదివాడని, ఈయన మహాత్మా గాంధీ తో కలిసి అనేక సత్యాగ్రహాలలో పాల్గొన్నాడని, స్వతంత్ర సమరంలో పాల్గొన్నారని, ఈయన మన దేశానికీ హోమ్ శాఖ మంత్రి మరియు ఉప ప్రధాని గా పని చేసారని, ఈయన భారత దేశంలో 250 సంస్థానాలు విలీనం చేసాడని, ఈయన పేరిట ప్రధాన మంత్రి మోదీ ప్రపంచంలో ఎక్కడా లేనివంటి 175 అడుగులు ఎత్తయిన విగ్రహం గుజరాత్ లో నర్మదా నది తీరాన స్థాపించారని మొదలగు విషయాలు తెలియజేసారు.ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

