49 బన్నూరు చేపల చెరువును పరిశీలించిన డీఎల్ డీఓ..
1 min read

మిడుతూర్ లో 94 శాతం పింఛన్ల పంపిణీ..
మిడుతూరు , న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామ పొలిమేరలో ఉన్న పిక్కిలి చెరువును ఆత్మకూరు డీఎల్ డీఓ అన్వరా బేగం శనివారం పరిశీలించారు.చెరువును చేపల వేలం పాట గురించి పరిశీలించడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు.తర్వాత కడుమూరులో ఎంపీడీవో దశరథ రామయ్య తో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా నూతన రైస్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను డిఎల్డిఓ పరిశీలించారు.ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె సిబ్బందికి సూచించారు.మిడుతూరులో భర్తకు పింఛన్ వస్తూ గత నెలలో మరణించిన వారి ఇద్దరు వితంతువుల పెన్షన్ మంజూరు అయినదని వారికి మండల టీడీపీ కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,ఎంపీడీవో పింఛన్లను పంపిణీ చేశారు. శనివారం సాయంత్రం నాటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు5,294 పెన్షన్లకు గాను 4,963 పెన్షన్లు అనగా 94 శాతం పింఛన్లను మండలంలో పంపిణీ చేసినట్లుఎంపీడీఓ తెలిపారు.అదే విధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు బి శివకళ్యాణ్ సింగ్,వి.వినయ్ చంద్ర పాల్గొన్నారు.

