NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

3న  కౌలు రైతుల ధర్నా

1 min read

అన్నదాత సుఖీభవ రూ.20వేలను వెంటనే జమ చేయండి

కరపత్రాలు పంపిణీ చేసిన ప్రజాసంఘాల నాయకులు

డోన్, న్యూస్ నేడు : ప్రస్తుత అధికారములో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తామని కౌలు రైతులను అన్ని విధాల ఆదుకొని కొత్త చట్టం తెస్తామని, ప్రతికౌలు రైతుకు అన్నదాత సుఖీభవ పథకం క్రింద 20 వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారం లోకి వచ్చిన తర్వాత ముసయిదా చట్టాన్ని తయారు చేసి వివిధ ప్రాంతాలలో రైతులు, రైతు సంఘాలు సంస్థలు పెద్దల అభిప్రాయమును కోరింది. అన్ని పంటలకు మద్దతు ధరలు పడిపోయాయి. విత్తనాలు, పురుగు మందులు విపరీతంగా పెరిగాయి. అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న అన్ని రకాల పంటలకు ఎకరాకు 40 వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని తక్షణమే మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పారుచేయాలని కోరుతూ ఈ నెల 3 వతేది సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ఆందోళనలో రైతులు, కౌలు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయ వలెనని ఎపి కౌలు రైతు సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు వి.సుబ్బరాయుడు, డోన్ సిపిఎం మండల కార్యదర్శి పి.రామాంజనేయులు, పట్టణ కార్యదర్శి నక్కి.శ్రీ కాంత్,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి టి.శివ రామ్, రైతు నాయకులు ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author