టెట్ సమస్యను పరిష్కరించి చూపుతాం.. ఆపస్
1 min read

ఒంగోలు , న్యూస్ నేడు : సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 23/10/2010 తేది కన్నా ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పాస్ కావాలనే నిబంధన విధించడం, అందుకు అనుగుణంగా రాష్ట్ర విద్యా శాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయులు అందరూ రాయాలనడం తో ఉపాధ్యాయులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన సమస్యను పరిష్కరించి చూపుతామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్న బాలాజీ పేర్కొన్నారు.ఒంగోలు నందు ఏకేవీకే కళాశాల నందు ఆపస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె మల్లికార్జున రావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా యస్ బాలాజీ మాట్లాడుతూటెట్ విషయమై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రి కి వినతి పత్రాలు సమర్పించామని, ABRSM ఆధ్వర్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీ సమస్య తీవ్రతను తెలియజేశామని, త్వరలోనే వారిని కలిసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంట్లో చట్టాన్ని సవరించి అయినా సరే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇప్పిస్తామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సంఘటన కార్యదర్శి సి హెచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ హై స్కూల్ ప్లస్లలో పిజిటి ఉపాధ్యాయులు లేక ఇంటర్ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, హై స్కూల్ ప్లస్ లలో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఎం చక్రపాణి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఎన్నో ఏళ్లగా ప్రమోషన్లకు నోచుకోని ఉపాధ్యాయులకు అన్ని కేడర్ల ప్రమోషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కే మల్లికార్జునరావు మాట్లాడుతూ జీవో 223 రద్దుచేసి 302 జీవో పునరుద్ధరించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% మద్యంతర భృతి (ఐ.ఆర్) ప్రకటించాలని, ఆర్థిక బకాయిల విడుదలకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు CH . హిమజ,జిల్లా కోశాధికారి గుణ ప్రసాద్, కె.శంకర్రావు,R. పెద్ద రాయుడు,కే.వి. శేషారావు, వి.మార్కండేయులు, పి..కిష్టయ్య, టి.శేషారావు,టి యల్ .సరస్వతి, పి. ప్రసూన , వి. రమణయ్య , వై. కోటేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాలా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు


