NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్వేయర్ల సంఘం అధ్యక్షుడిగా కృష్ణుడు ఎన్నిక..

1 min read

సమస్యల పరిష్కారానికి కృషి

నూతన అధ్యక్షులు కృష్ణుడు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:   నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సర్వేయర్ల సంఘం అధ్యక్షుడిగా ఎల్. కృష్ణుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈయన మిడుతూరు మండల డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్నారు.ఆత్మకూరు తహసిల్దార్ కార్యాలయంలో డివిజన్ ఎలక్షన్ అధికారి రవి ప్రకాష్ అధ్యక్షతన జరిగింది.నూతన కమిటీ వివరాలు:డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా సామన్న (పగిడ్యాల గ్రామ సర్వేయర్), సెక్రటరీగా వెలుగోడు మండలం గ్రామ సర్వేయర్ శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీగా వీపనగండ్ల గ్రామ సర్వేయర్ ఎం రాంబాబు,ట్రెజరర్ గా జుపాడుబంగ్లా మండలం గ్రామ సర్వేయర్ సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వెలుగోడు మండలం నుండి రజియా సుల్తానా,గౌరీ, కడుమూరు-గోపికృష్ణ,రాజు- కొత్తపల్లి,అరుణ్ కుమార్, నాగమణి లను కమిటీగా ఎన్నుకున్నట్లు డివిజన్ అధ్యక్షులు కృష్ణుడు తెలిపారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ గతంలో తాలూకా స్థాయిలో కమిటీలు ఉండేవని మొదటిసారిగా డివిజన్ స్థాయిలో కమిటీని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.ఆత్మకూరు డివిజన్ లో పనిచేస్తున్న  సర్వేయర్లకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.తర్వాత నూతన కమిటీ సభ్యులను రెవెన్యూ అధికారులు ఘనంగా సత్కరించారు.

About Author