ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక సప్తాహం
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తి.తి.దే.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరం మాధవనగర్ నందు కొలువైన శ్రీ శివరామాలయం నందు గత ఏడు రోజుల నుండి జరుగుతున్న ధార్మిక సప్తాహం బుధవారం సాయంత్రం అత్యంత వేడుకగా ముగిసినది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు విశిష్ట పండితులచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక శ్రీరంగధామం పారాయణ బృందం అధ్యక్షులు బిలకంటి మురళి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, భజనలు శ్రవణానందకరంగా సాగినది. బుధవారం కార్తిక పౌర్ణమి విశిష్టతపై జి.బలరామాచార్య ప్రవచించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షులు అత్తలూరు రాఘవేంద్ర కుమార్, కార్యదర్శి యివటూరి కోటేశ్వరరావు, కోశాధికారి ఇస్కాల రాజశేఖర్, కమిటీ సభ్యులు, పారాయణబృందం సభ్యులు పాల్గొన్నారు.

