NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీతంపేట, మొండూరు లలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

1 min read

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గ పరిధిలో 51 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా,  ఖరీఫ్ లో ఒకలక్ష 37వేల 452 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా  ముందుకు వెళ్తున్నామని, ఎటువంటి దళారీలకు అవకాశం లేకుండా ఎంతో పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు.ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో భాగంగా నియోజకవర్గ పరిధిలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు మండలం సీతంపేటలోని విశాల సహకార పరపతి సంఘం, కొత్తగూడెం రైతు సేవ కేంద్రం వద్ద, అనంతరం పెదవేగి మండలం ముండూరులోని సొసైటీ ప్రాంగణంలో మరొక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ రైతులతో కలిసి ప్రారంభించారు .అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని రైతులకు అవసరమైన గోనెసంచుల నిల్వలను ఉంచడంతోపాటు అకాల వర్షాల వల్ల ఏ ఒక్క రైతు కూడా తమ ధాన్యం గింజలు నిల్వలు ఇబ్బంది పడకుండా ఉండేలా ముందస్తుగానే టార్పాలిన్లను కూడా సంబంధిత అధికారులు. సిద్ధం చేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ అంశంలో సంబంధిత ప్రభుత్వాధికారులు చొరవ చూపి రైతులకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్  సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా, దెందులూరు ఎమ్మార్వో శ్రీమతి సుమతి, సీతంపేట సొసైటీ చైర్మన్ ఎలమర్తి హేమ శ్రీనివాస్, ముండూరు సొసైటీ చైర్మన్ కొనకల్ల శివమణి, సొసైటీల డైరెక్టర్లు,  క్లస్టర్ ఇంచార్జ్ పరస వెంకటరావ్ , వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు  అనిల్ కుమారి, వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు, సహా వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author