ఘనంగా వందేమాతరం గీతం 150 సంవత్సరాల పండుగ
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండలో శుక్రవారం వందేమాతర గీతం 150 సంవత్సరాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు భక్తిశ్రద్ధలతో సంపూర్ణ వందేమాతర గీతాలాపన చేశారు.విద్యార్థులు విద్యార్థి దశ నుంచే దేశ భక్తి, భావాలు పునికి పుచ్చుకోవాలని పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం పత్తికొండలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తి సంపూర్ణ వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఇందులో భాగంగా సెయింట్ జోసెఫ్ స్కూల్లో వందేమాతరం ప్రోగ్రాం ఇంచార్జ్ గోవర్ధన్ నాయుడు అధ్యక్షతన రూరల్ సీఐ పులిశేఖర్ వందేమాతర గీతాలాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, —వందేమాతరం గీతం మన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చిన గీతం అని, ఇది కేవలం పాట కాదు, దేశభక్తి యొక్క చిహ్నం అని తెలిపారు. ప్రతి భారతీయుడు ఈ గీతాన్ని గుండె లోతుల్లో గౌరవించాలి,” ఈ గీతం నేటితో నూట యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దీనిని రచించిన బంకిం చంద్ర చటర్జీ గారిని స్మరిస్తూ విద్యార్థిని, విద్యార్థులు మీ విద్యార్థి దశ నుండే దేశంపై సమగ్రంగా, సృజనాత్మకంగా దేశ నిర్మాణంలో మీరు బాగస్వాములు అయ్యేవిధంగా ఆలోచనలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాల్గొన్న ప్రోగ్రాం ఇంచార్జ్ గోవర్ధన్ నాయుడు, సహా ఇంచార్జ్ కరణం నరేష్ మాట్లాడుతూ —వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వరాజ్యం – స్వదేశీ – సమైక్యత అనే నినాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుందని దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు.

