NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డోన్ తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

1 min read

మహానంది, న్యూస్​ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ తహసిల్దార్ కార్యాలయం పై ఉమ్మడి కర్నూలు జిల్లా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తాసిల్దార్ సునీల్ రాజు గుంటపల్లి గ్రామానికి చెందిన దామ వేణుగోపాల్ నుండి 35వేల రూపాయలు లంచం తీసుకొని చుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. జగతుర్ది గ్రామంలోని సర్వే నెంబర్ లోని 20-1 ,20-బి 2, 27 బి 2, నందు ఉన్నటువంటి డాట్ ల్యాండ్ ను చుక్కల భూమిగా మార్చడానికి లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పి సోమన్న పేర్కొన్నారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య, శ్రీనివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి సోమన్న తెలిపారు.

About Author