NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గోడ పత్రిక ఆవిష్కరణ

1 min read

ఆవిష్కరించిన పెదపాడు తహసీల్దార్ ఏ.కృష్ణ జ్యోతి

నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు కార్యక్రమాలు

 ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి

గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు. జాన్ బాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రికలు,గోడ పత్రికలు పెదపాడు తహసిల్దార్  ఏ.కృష్ణ జ్యోతి  ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 14 తేదీ నుండి నుండి 20 తేదీ వరకు జరగబోవు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు. గ్రంథాలయ అధికారి దుగ్గుపోగు. జాన్ బాబు మాట్లాడుతూ గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని,ఈ సందర్భంగా బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, గ్రంధాలయ వ్యవస్థాపకులకు, పితామహులకు నివాళులర్పించడం,వివిధ  ప్రముఖా వ్యక్తులతో ప్రసంగాలు, సెమినార్లు, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించబడుతుందని, నిర్వహించబడిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 20వ తేదీన ముగింపు సభలో ముఖ్య అతిథుల చేతులమీదుగా బహుమతి ప్రధానం జరుగునని తెలియజేసినారు.

About Author