NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2 లక్షల భీమా చెక్ అందజేసిన బ్యాంక్ మేనేజర్..

1 min read

భార్య మృతితో భర్తకు చెక్కు పంపిణీ..

మిడుతూరు, న్యూస్​ నేడు:  భార్య మృతి చెందడంతో రెండు లక్షల చెక్కును భర్తకు అందజేసినట్లు గార్గేయపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సునార్ అన్వర్ భాష తెలిపారు.మేనేజర్ తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట  గ్రామానికి చెందిన మాధవరం మునెమ్మ గతంలో గుండె నొప్పితో మృతి చెందారు.మునెమ్మ గార్గేయపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఖాతా దారురాలిగా ఉన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబివై)కింద 436 రూ.లు ఇన్సూరెన్స్ సంవత్సరానికి చెల్లించారు.ఈమెకు నామినీగా ఉన్న భర్త ప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరుపున రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ ను మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ జి.పద్మావతి గురువారం మధ్యాహ్నం బ్యాంక్ లో అందజేసినట్లు మేనేజర్ తెలిపారు.బ్యాంకు ఖాతాదారులందరూ ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా ఉండాలని ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా అనుకోని సంఘటన జరిగితే ఈ నగదు కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ అన్వర్ భాష అన్నారు.ఈ కార్యక్రమంలోబ్యాంక్ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ ధీమంత్,స్వాతి,వందిత  నందికొట్కూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు నాగార్జున,రియాజుద్దీన్, ఎస్ఎస్ టి సంస్థ పీడీ ఆంజనేయులు పాల్గొన్నారు.

About Author