NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ బిసి, ఎస్సి వెల్ఫేర్ హాస్టల్స్ లో బాలల దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు మరియు  కంటి డాక్టర్ కే. స్వాతి సౌజన్యముతో బిసి ఎస్సి వెల్ఫేర్ హాస్టల్స్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిభిరాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి       జి. కబర్థి.  జడ్జి మాట్లాడతూ జవహర్ లాల్ నెహ్రు యొక్క బాల్యం, విద్యాభ్యాసం, దేశానికి ఆయన చేసిన సేవను గురించి తెలియజేసారు. విద్యా హక్కు చట్టం, బాలల హక్కుల గురించి, పేదరికం, నిరక్షరాస్యత, బాల కార్మిక సమస్య, అక్రమ రవాణా మరియు చట్టపరమైన అవగాహనను గురించి విద్యార్దులకు వివరించారు. దృష్టిలోపం గల పిల్లలకు ఉచిత కంటి అద్దాలు, మందులను జిల్లా జడ్జి చేతుల మీదుగా పిల్లలకు అందజేశారు. అనంతరం వ్యాస రచన, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్దులకు సర్టిఫికెట్లు, బహుమతులను జిల్లా జడ్జి చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, డీసి పిఓ శారద, కంటి డాక్టర్ కే. స్వాతి, లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు,యస్ సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మద్దిలేటి,మూడవ పట్టణ సీఐ శేషయ్య, హాస్టల్స్ వార్డెన్స్ రజని,శైలజ సులోచన, విద్యార్దులు తదితరులు పాల్గోన్నారు.

About Author