NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలల దినోత్సవ వేడుకల్లో న్యాయవాదులు..

1 min read

నందికొట్కూర్ లో ఘనంగా బాలల దినోత్సవం..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మరియు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఆటపాటలతో చక్కని డాన్స్ లతో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన వేడుకల్లో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యానెల్ న్యాయవాదులు కొంగర వెంకటేశ్వర్లు,మద్దయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభ్యున్నతిలో ప్రగతి సాధించాలంటే మీలో తప్పనిసరిగా తపన అనేది ఉండాలని అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారని అంతేకాకుండా చెడు అలవాట్లకు గురికాకుండా పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయులు చెప్పిన విధంగా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఖాజా హుస్సేన్,న్యాయవాది కుమారస్వామి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author