వైభవోపేతంగా శ్రీ అయ్యప్ప స్వామి వారికి అభిషేకము పడిపూజ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి వారి దీక్షాధారణ స్వీకరించి శబరిమల యాత్రకు నిజామాబాద్ నుండి కాలినడకన ప్రయాణం చేయుచున్న సువర్ణభూమి అయ్యప్ప భక్తులు ఈ రోజున మన కర్నూలు సూర్యనారాయణ స్వామివారి దేవాలయ దత్త కళాక్షేత్రము నందు శ్రీ అయ్యప్ప స్వామి వారి అభిషేకము పడిపూజ వైభవోపేతముగా నిర్వహించడం జరిగినది. ఇందులో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. ఎం శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు మరియు ఎస్వీ రమణారెడ్డి వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారములతో మరియూ సూర్య దేవాలయ ట్రస్టీ సభ్యులు టి. శివ రామకృష్ణ మాతృమండలి సభ్యులు సహకారముతో అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.


