NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భాష్యంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టంలోని భాష్యం  ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శుక్రవారం  విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ ,  రాయలసీమ 5 జెడ్ ఈఓ మాచాని కవితల ఆదేశాల మేరకు భాష్యం స్కూల్లో   బాలల  దినోత్సవం  జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్ఈఓ మాచాని కవిత మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకునే సందర్భంగా పిల్లలను ఉద్దేశిస్తూ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాలలో  ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు  జెడ్ ఇ ఓ కవిత, ప్రిన్సిపల్ నాగరాజ్, విద్యార్థిని విద్యార్థులకు  బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో పాఠశాల  హెచ్ఎం అనురాధ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

About Author